సింధియా: దేశ సముద్ర రక్షణ, నౌకా నిర్మాణ రంగాల్లో తన ప్రాధాన్యాన్ని మరింత బలోపేతం చేస్తూ హిందూస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్‌ఎస్‌ఎల్) 86వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సాంకేతిక ఆవిష్కరణలు, కార్యాచరణ సామర్థ్యాల పెంపునకు దోహదపడే పలు ఆధునిక కార్యాలయాలు, డాష్‌బోర్డ్ ఆధారిత సముద్ర పరీక్షల నిర్వహణ వ్యవస్థను సంస్థ సీఎండీ కెప్టెన్ గంటి వెంకటేశ్వర్లు, ఐఎన్ (రిటైర్డ్) ప్రారంభించారు. అలాగే జ్ఞాన విస్తరణకు దోహదపడే 11 ప్రచురణలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్‌ఎస్‌ఎల్ నేటి స్థాయికి చేరుకోవడం వెనుక తరతరాల ఉద్యోగుల సమష్టి కృషి ప్రధాన కారణమన్నారు. ఉద్యోగుల సృజనాత్మకత, క్రమశిక్షణ, జట్టుకృషితో సంస్థ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.


