పోర్టును సందర్శించిన ట్రైనీ ఐఏఎస్‌ అధికారులు | - | Sakshi
Sakshi News home page

పోర్టును సందర్శించిన ట్రైనీ ఐఏఎస్‌ అధికారులు

Jun 21 2026 12:25 AM | Updated on Jun 21 2026 12:25 AM

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ దర్శన్‌లో భాగంగా 2025 బ్యాచ్‌కు చెందిన ట్రైనీ ఐఏఎస్‌లు విశాఖపట్నం పోర్టును శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పోర్టు చైర్మన్‌ జేఎస్‌ బింద్రా.. అసిస్టెంట్‌ కలెక్టర్స్‌ అండర్‌ ట్రైనీస్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు. దేశ ఆర్థికాభివృద్ధిలో పోర్టు పాత్ర, కార్యాచరణ సామర్థ్యాలపై సమగ్ర ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. అనంతరం జరిగిన ఇంటరాక్టివ్‌ సెషన్‌లో పోర్టు సరకు నిర్వహణ, ఆధునికీకరణ, సౌర విద్యుదుత్పత్తి, మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్వహణ, నూతన అంతర్జాతీయ క్రూయిజ్‌ టెర్మినల్‌, ఎగుమతి–దిగుమతి అవకాశాలపై శిక్షణార్థులకు పూర్తి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పోర్టు డిప్యూటీ చైర్‌పర్సన్‌ రోష్ని అపరంజి కొరటి, పోర్టు సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement