జేష్ట శుద్ద పంచమి శుక్రవారం కావడంతో పాటు, అత్యంత శ్రేష్టమైన ముహూర్తాలు ఉండటంతో సూపర్‌బజార్ వద్ద ఉన్న జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం జనంతో కిటకిటలాడాయి. స్థలాలు, భవనాల కొనుగోలు దస్తావేజుల రిజిస్ట్రేషన్లతో పాటు, వివాహ రిజిస్ట్రేషన్ల కోసం కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శుభ ముహూర్తాల నేపథ్యంలో ఉదయం నుంచే మొదలైన ఈ రద్దీ సాయంత్రం వరకు నిరంతరాయంగా కొనసాగింది. దరఖాస్తుదారులు, వారి బంధువుల రాకతో కార్యాలయ పరిసరాలన్నీ రోజంతా కోలాహలంగా మారాయి. – మహారాణిపేట/ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం


