పెదగంట్యాడ తహశీల్దార్‌పై నేడు లోక్‌యుక్త విచారణ | - | Sakshi
Sakshi News home page

పెదగంట్యాడ తహశీల్దార్‌పై నేడు లోక్‌యుక్త విచారణ

Jun 20 2026 12:30 PM | Updated on Jun 20 2026 12:30 PM

మహారాణిపేట: పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పెదగంట్యాడ తహసీల్దార్‌ తీరుపై లోక్‌యుక్త ఆదేశాల మేరకు శనివారం ఉదయం 11 గంటలకు విశాఖ ల్యాండ్‌ ప్రొటెక్షన్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ విచారణ జరపనున్నారు. పెదగంట్యాడ తహసీల్దార్‌ కార్యాలయంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ గత ఏడాది అక్టోబర్‌ 23న ‘సాక్షి’ దినపత్రికలో ‘చిరుద్యోగికి పగ్గాలు’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. అలాగే తహసీల్దార్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ సీనియర్లను కాదని ఒక గ్రేడ్‌–1 వీఆర్‌వోకు ఆర్‌ఐ బాధ్యతలు అప్పగించారని, పలు వ్యవహారాల్లో తప్పుడు సమాచారం ఇచ్చారని సామాజిక కార్యకర్త వెంపాడ అప్పలరాజు ఈ ఏడాది జనవరి 30న లోక్‌యుక్తకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా లోక్‌యుక్త ఆదేశించడంతో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ను ఆదేశించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement