అర్హుల సంఖ్య తగ్గించడం అన్యాయం | - | Sakshi
Sakshi News home page

అర్హుల సంఖ్య తగ్గించడం అన్యాయం

Jun 20 2026 12:19 AM | Updated on Jun 20 2026 12:19 AM

వ్యవసాయ పెట్టుబడి సాయం కోసం అన్నదాతలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది కూటమి ప్రభుత్వం ఎలాంటి సహాయం అందించలేదు.ఇప్పుడు నిబంధనల పేరిట వేలాది మంది అర్హులైన రైతుల పేర్లను జాబితా నుంచి తొలగించారు. ప్రభుత్వం స్పందించి అర్హులందరికీ ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని వర్తింపజేయాలి.

– రవ్వ ఈశ్వరరావు,

తాటితూరు, భీమిలి మండలం

అర్హులందరికీ సాయం

అందించాలి

వ్యవసాయం చేస్తున్న ప్రతి రైతుకూ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించాలి. కొందరిని మాత్రమే ఎంపిక చేసి, మరికొందరిని జాబితా నుంచి తొలగించడం అన్యాయం. ఈ సీజన్‌లో రైతులందరికీ ‘అన్నదాత సుఖీభవ’ పథకం వర్తింపజేస్తే పంటల సాగుకు ఊతమిచ్చినట్టవుతుంది.

– తమ్మిన సీతారామ్‌, టీ.నగరపాలెం, విశాఖ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement