సూపర్‌ దగా | - | Sakshi
Sakshi News home page

సూపర్‌ దగా

Jun 19 2026 1:12 AM | Updated on Jun 19 2026 1:12 AM

అవి విజయోత్సవాలు కాదు.. వెన్నుపోటు సంబరాలు
ప్రభుత్వం చేసింది గోరంత.. ఆర్భాటం కొండంత రెండేళ్ల కూటమి పాలనలో అడుగడుగునా ప్రజావంచన మహా మోసాల ‘సూపర్‌ సిక్స్‌’.. అస్తవ్యస్తమైన విశాఖ

రెండేళ్ల పాలనపై ప్రజల ఆగ్రహం

18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామంటూ ఆశలు రేపిన బాబు.. అధికారం దక్కాక ఆ ఊసే ఎత్తడం లేదు. రెండేళ్లుగా మహిళలు తమ ఖాతాల్లో డబ్బులు పడతాయేమోనని కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్నా.. మిగిలింది మాత్రం గుండుసున్నా.

జిల్లాలో అర్హులైన మహిళలు: 8 లక్షల మంది

రెండేళ్ల కాలంలో ఒక్కొక్కరికీ రావాల్సింది: రూ.36,000

మహిళల పొట్టగొట్టి బాబు సర్కారు మిగిల్చుకున్నది: రూ.2,880 కోట్లు

ఎన్నికల ముందు ఆకాశమే హద్దుగా

హామీలిచ్చి.. అధికార పీఠమెక్కాక ప్రజల

నమ్మకాన్ని నిలువునా వంచించిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ‘విజయోత్సవాల’ పేరిట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తగలేస్తోంది. రెండేళ్ల పాలనలో సమాజంలోని ఏ ఒక్క వర్గానికై నా మేలు జరిగిందా? అంటే శూన్యమనే సమాధానం వస్తోంది. పిల్లల చదువుల నుంచి పేదల వైద్యం వరకు, నిరుద్యోగుల భృతి నుంచి మహిళల ‘ఆడబిడ్డల నిధి’ పథకం వరకు అడుగడుగునా దగాన పడ్డ విశాఖ జనం.. ఈ సంబరాలు విజయానికా? లేక ఘోర వైఫల్యాలకా? అని ప్రశ్నిస్తున్నారు. చేసిన తప్పులను, ఇచ్చిన వెన్నుపోటు గాయాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ తప్పుడు ఆర్భాటాలంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

– సాక్షి, విశాఖపట్నం

ఉన్నత విద్యకు శాపం!

దివంగత వైఎస్సార్‌, ఆ తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌ కొండంత అండగా నిలిచింది. కానీ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం కాలేజీలకు నిధులు విడుదల చేయకుండా బకాయిలు పెట్టడంతో, యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నాయి. పేదవాడి చదువును దూరం చేసే కుట్ర సాగుతోంది.

ఉమ్మడి విశాఖలో లబ్ధిదారులు: సుమారు 60 వేలు

రెండేళ్లుగా నిలిపివేసిన ఫీజుల బకాయిలు:

సుమారు రూ.300 కోట్లు

‘తల్లి’కి ఎగనామం..!

త వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ‘అమ్మ ఒడి’ ద్వారా ప్రతి పేద విద్యార్థి చదువుకు భరోసా లభిస్తే, చంద్రబాబు సర్కారు ‘తల్లికి వందనం’ పేరుతో పెద్ద ఎత్తున కోత విధించింది. బడికెళ్లే పిల్లలందరికీ రూ.15 వేలు ఇస్తామని నమ్మించి, తీరా సమయానికి లబ్ధిదారుల సంఖ్యను సగానికి సగం తగ్గించేసింది.

జిల్లాలో మొత్తం విద్యార్థులు: 3,26,494 మంది

తల్లికి వందనం ఇస్తున్నది : 1,90,907 మందికి

ంద్రబాబు మోసం చేస్తోంది: 1,35,587 మంది

‘ఉచిత గ్యాస్‌’.. ఉత్తుత్తి కబుర్లే!

డాదికి 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామంటూ ప్రచారం ఊదరగొట్టారు. కానీ క్షేత్రస్థాయిలో సగం మందికి కూడా సిలిండర్లు అందడం లేదు. లబ్ధిదారుల్లో కనీసం 60 శాతం మందికి కూడా రాయితీ డబ్బులు జమకావడం లేదు.

ఉచిత గ్యాస్‌కు అర్హులైన గృహాలు: 5.17 లక్షలు

అందుతున్నది అరకొరగానే: 3.71 లక్షల ఇళ్లకు మాత్రమే

రెండేళ్లలో ఎగ్గొట్టిన సిలిండర్ల సంఖ్య: 5.50 లక్షల సిలిండర్లు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement