కై లాసగిరిపై.. పట్టాలెక్కని ‘టాయ్‌ ట్రైన్‌’ | - | Sakshi
Sakshi News home page

కై లాసగిరిపై.. పట్టాలెక్కని ‘టాయ్‌ ట్రైన్‌’

Jun 18 2026 1:35 AM | Updated on Jun 18 2026 1:35 AM

8లో

న్యూస్‌రీల్‌

బీచ్‌లో షాక్స్‌

భవన వ్యర్థాలతో రోడ్లు..

కాలువలకు రంగులు!

గురువారం శ్రీ 18 శ్రీ జూన్‌ శ్రీ 2026

విశాఖ తీరంలో

అధినేతను కలిసిన

మాజీ మేయర్‌ దంపతులు

మద్యం కిక్కు

ఆరిలోవ: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డిని మాజీ మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి, ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు గొలగాని శ్రీనివాస్‌ బుధవారం అమరావతిలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనకు శ్రీకృష్ణుడి విగ్రహం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని జగన్‌మోహన్‌రెడ్డి సూచించినట్లు హరివెంకటకుమారి తెలిపారు.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:

కపై విశాఖ బీచ్‌కు వెళ్లేముందు కుటుంబ సభ్యులు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి రానుంది. ఆహ్లాదం, ఆనందం కోసం సముద్ర తీరానికి వచ్చే నగరవాసులకు, పర్యాటకులకు ఇక నుంచి మందుబాబుల తిప్పలు తప్పేలా లేవు. విశాఖపట్నం బీచ్‌ ఒడ్డున ‘బీచ్‌ షాక్స్‌’ పేరిట లిక్కర్‌ విక్రయాలు జరిపేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడమే ఇందుకు ప్రధాన కారణం. ఏకంగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ షాక్స్‌లలో మద్యం విక్రయించుకోవచ్చంటూ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. విశాఖ తీరంలో ప్రాథమికంగా రెండు ప్రాంతాల్లో ఈ బీచ్‌ షాక్స్‌ ఏర్పాటు కానున్నాయి. గతంలో ఒకసారి ఇటువంటి ప్రయత్నం చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ప్రజల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకతతో వెనక్కి తగ్గింది. కానీ, ఈ విడత మాత్రం నగరవాసుల నిరసనలను బేఖాతరు చేస్తూ ముందుకు వెళ్తుండటం గమనార్హం.

‘భోజనం’ పేరిట హంగామా!

ఈ బీచ్‌ షాక్స్‌లలో బీర్‌, వైన్‌తో పాటు రెడీ–టు–డ్రింక్‌ రకాలను విక్రయించేందుకు అనుమతించారు. అంతేకాకుండా, రాత్రి 8 గంటల తర్వాత కూడా అక్కడ ఆహార పదార్థాలను సరఫరా చేసేందుకు వీలుగా ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. దీంతో రాత్రి పొద్దుపోయే వరకు భోజనం పేరిట మందుబాబులు బీచ్‌లోనే తిష్టవేసి హంగామా చేసే అవకాశం ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబాలతో కలిసి ప్రశాంతంగా సేదతీరేందుకు వచ్చే వారికి ఇది తీవ్ర ఇబ్బందికరంగా మారనుంది.

అధిక ధరల దందా!

రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ తెచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసి ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టింది. ప్రస్తుతం సిండికేట్లు ఇష్టారాజ్యంగా ప్రతి బాటిల్‌ పై రూ.10 చొప్పున అదనంగా వసూలు చేస్తూ దోపిడీకి తెరలేపారు. ఇవన్నీ అధికార పార్టీ నేతల దుకాణాలే కావడంతో ఎకై ్సజ్‌ అధికారులు సైతం కన్నెత్తి చూసే సాహసం చేయడం లేదు. రేపు బీచ్‌ షాక్స్‌లలోనూ మద్యం ధరలు ఇష్టారాజ్యంగానే ఉండే ప్రమాదం ఉంది. ఇప్పటికే స్టార్‌ హోటళ్ల వార్షిక లైసెన్స్‌ ఫీజును రూ.66 లక్షల నుంచి రూ.25 లక్షలకు తగ్గించిన ప్రభుత్వం.. బీచ్‌ షాక్స్‌కు కూడా నామమాత్రపు ఫీజునే ఖరారు చేసింది.

అస్మదీయుల కోసమే పాలసీ..

సాధారణ వ్యాపారులు దరఖాస్తు చేసే సాహసం కూడా చేయకుండా.. దరఖాస్తు ఫీజునే ఏకంగా రూ.2 లక్షలుగా నిర్ణయించడం విశేషం. కేవలం అధికార టీడీపీ నేతలు, స్టార్‌ హోట ళ్ల యజమానులకు లబ్ధి చేకూర్చడానికే ఈ నిబంధనలు పెట్టారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు షాక్స్‌ తమకే దక్కేలా అధికార పార్టీ నేతలు తీవ్రస్థాయిలో పైరవీలు ప్రారంభించారు. తమకు ప్రైవేట్‌ బీచ్‌ ఉందంటూ ప్రచారం చేసుకునే రెండు హోటళ్ల యజమానులతో పాటు.. చినబాబు సిఫార్సులతో మరో కీలక నేత రంగంలోకి దిగినట్టు సమాచారం.

వార్షిక లైసెన్స్‌ ఫీజు: రూ. 7.5 లక్షలు

దరఖాస్తు రుసుం:

రూ. 2 లక్షలు

(నాన్‌–రీఫండబుల్‌)

అద్భుత భవనాలపై

ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు మద్యం విక్రయాలు రెండు చోట్ల ‘బీచ్‌ షాక్స్‌’ ఏర్పాటు బీర్‌, వైన్‌, రెడీ–టు–డ్రింక్‌ బ్రాండ్ల అమ్మకాలకు అనుమతి రాత్రి 8 తర్వాత ఆహార సరఫరాకూ సర్కారు గ్రీన్‌సిగ్నల్‌ కుటుంబాలతో కలిసి సేదతీరాలంటే ఇక ఇబ్బందులే..!

టిడ్కో, పీఎంఏవై గృహాల పనులు వేగవంతం చేయాలి

కలెక్టర్‌, జీవీఎంసీ ప్రత్యేకాధికారి

అభిషిక్త్‌ కిషోర్‌ ఆదేశం

బీచ్‌ షాక్స్‌

ఫీజుల వివరాలు

గతంలో వెనక్కి.. ఈసారి ముందుకే..

నిజానికి, గతంలోనూ విశాఖ తీరంలో లిక్కర్‌ విక్రయాలు జరిపేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించింది. ఇందులో భాగంగానే 2016లో బీచ్‌ బార్ల ఏర్పాటుకు జీవో నంబర్‌ 470 విడుదల చేసింది. అదే సమయంలో వైజాగ్‌లో ‘బికినీ ఫెస్టివల్‌’ నిర్వహిస్తామంటూ చేసిన ప్రకటనలపై నగరవాసులు మండిపడ్డారు. అప్పట్లో ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో పాటు మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడంతో చంద్రబాబు వెనక్కి తగ్గక తప్పలేదు. కానీ ఈసారి మాత్రం ప్రజాభిప్రాయాన్ని, మహిళల ఆవేదనను ఏమాత్రం లెక్కచేయకుండా ప్రభుత్వం ఏకంగా జీవో నంబర్లు 362, 363 జారీ చేసి మరీ బీచ్‌ షాక్స్‌ ఏర్పాటుకు తెగబడటం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement