మహారాణిపేట: సమాచార, పౌర సంబంధాల శాఖ జోన్–1 రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్‌జేడీ)గా కె.సదారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఆయనకు ప్రభుత్వం జాయింట్ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్‌జేడీ బాధ్యతలతో పాటు విశాఖపట్నం జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారిగా అదనపు బాధ్యతలను కూడా నిర్వహించాలని శాఖ డైరెక్టర్ కె.ఎస్.విశ్వనాథన్ ఆదేశాలు జారీ చేశారు. కె.సదారావు 1991లో పాడేరులో ఏపీఆర్‌ఓగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం డివిజనల్ పీఆర్‌ఓగా పలు ప్రాంతాల్లో సేవలందించారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో డీపీఆర్‌ఓ, విజయవాడలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా, నెల్లూరులో ఉపసంచాలకుడిగా, రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రధాన కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు.


