● అమర్‌నాథ్‌పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు ● విజయమ్మ, భారతమ్మలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి ● ‘దళిత కార్డు’తో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు ● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి ధ్వజం | - | Sakshi
Sakshi News home page

● అమర్‌నాథ్‌పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు ● విజయమ్మ, భారతమ్మలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి ● ‘దళిత కార్డు’తో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు ● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి ధ్వజం

Jun 17 2026 12:22 AM | Updated on Jun 17 2026 12:22 AM

● అమర్‌నాథ్‌పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు ● విజయమ్మ, భారతమ్మలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి ● ‘దళిత కార్డు’తో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు ● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి ధ్వజం

సాక్షి, విశాఖపట్నం: హోం మంత్రి వంగలపూడి అనిత అధికార మదంతో హద్దులు దాటి మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి విమర్శించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతమ్మలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం మద్దిలపాలెంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజల, మహిళల భద్రతను గాలికొదిలేసి హోం మంత్రి అనిత తన బాధ్యతలను విస్మరించి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, గుడివాడ అమర్‌నాథ్‌తో పాటు వైఎస్సార్‌సీపీ నేతలపై వ్యక్తిగత విమర్శలకే పరిమితమయ్యారని ఆరోపించారు. మాజీ మంత్రి అమర్‌నాథ్‌ను ‘వాడు, వీడు’ అంటూ ఏకవచనంతో సంబోధించడం ఆమె అహంకారానికి నిదర్శనమన్నారు. అయితే గతంలో విజయమ్మ, భారతమ్మలతో పాటు జగన్‌పై కూడా అనిత గౌరవహీనంగా మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. తమ పార్టీ నుంచి ప్రతిస్పందన వస్తే వెంటనే ‘దళిత కార్డు’ను ప్రయోగిస్తున్నారని, దళితుల కోసం పనిచేయని అనితకు అలా మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. రాజకీయ లబ్ధి కోసం వర్గాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అంబేడ్కర్‌ రాజ్యాంగం కాకుండా ‘రెడ్‌బుక్‌ రాజ్యాంగం’ అమలవుతోందని విమర్శించారు. తునిలో బాలిక అదృశ్యమైన ఘటనలో కుటుంబాన్ని పరామర్శించలేదని, పాయకరావుపేటలో సీఐ పోస్టు ఖాళీగా ఉండటమే హోం శాఖ వైఫల్యానికి నిదర్శనమన్నారు. జగన్‌ జన్మదిన వేడుకల్లో కేక్‌ కట్‌ చేసిన దళితులపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించినప్పుడు హోం మంత్రి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన ‘సూపర్‌ సిక్స్‌’ పథకాల అమలులో విఫలమై, ‘సూపర్‌ హిట్‌’ సమావేశాలు నిర్వహించడం హాస్యాస్పదమన్నారు. మెగా డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ పోస్టు చేసిన వీడియోలను సోషల్‌ మీడియా నుంచి తొలగించారని, డైవర్షన్‌ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement