డాబాగార్డెన్స్: జీవీఎంసీ పరిధిలో ప్రతి సోమవారం సైక్లింగ్ డేని స్వచ్ఛందంగా ఆచరించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం తన అధికారిక నివాసం నుంచి జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి సైకిల్‌పై వచ్చారు. ఆయనతో పాటు జీవీఎంసీ సిబ్బంది కూడా సైకిళ్లపైనే కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతో ప్రతి సోమవారం సైక్లింగ్ డేగా ఆచరించాలని నిర్ణయించినట్లు తెలిపారు.


