బీచ్‌లో మద్యం విక్రయాల నిర్ణయంపై ‘ఐద్వా’ నిరసన | - | Sakshi
Sakshi News home page

బీచ్‌లో మద్యం విక్రయాల నిర్ణయంపై ‘ఐద్వా’ నిరసన

Jun 14 2026 10:19 AM | Updated on Jun 14 2026 10:19 AM

మహారాణిపేట: సముద్ర తీరంలో మద్యం విక్రయాలకు అనుమతులను నిరసిస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో శనివారం ఆర్‌కే బీచ్‌ కాళీమాత ఆలయం వద్ద నిరసన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బి.ప్రభావతి, జిల్లా నేతలు ఆర్‌.ఎన్‌. మాధవి, సత్యవతి, బి.పద్మ మాట్లాడుతూ.. గోవా కల్చర్‌ పేరుతో బీచ్‌లో మద్యం అమ్మకాలు జరపడం దుర్మార్గమన్నారు. ఖజానా నింపుకోవడానికి, మద్యం సిండికేట్ల కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. బీచ్‌లో మద్యం అందుబాటులోకి వస్తే మహిళల రక్షణ గాల్లో కలిసిపోతుందని, పర్యావరణం ధ్వంసమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో బెల్ట్‌ షాపులు, గంజాయి, డ్రగ్స్‌ రవాణాను అణచివేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఐద్వా ప్రతినిధులు డి.కొండమ్మ, ఆర్‌.వరలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు బి.ఎల్‌. నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement