గురువు చేతిలో సామాజిక బాధ్యత | - | Sakshi
Sakshi News home page

గురువు చేతిలో సామాజిక బాధ్యత

Jun 14 2026 10:19 AM | Updated on Jun 14 2026 10:19 AM

ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు డి.సంజీవ్‌కుమార్‌ ఇప్పటివరకు 24 సార్లు రక్తదానం చేశారు. విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాకుండా రక్తదానంపై అవగాహన కల్పిస్తూ సామాజిక బాధ్యతను నూరిపోస్తున్నారు. విశాఖ బ్లడ్‌ డోనర్స్‌ క్లబ్‌ సభ్యుడిగా అవసరమైనప్పుడు ముందుండి సేవలందిస్తున్నారు.

తండ్రి బాటలో..

సూరాడ అప్పారావు స్పూర్తితో ఆయన కుమార్తె, సంఘ సేవకురాలు రమాప్రియ (6 సార్లు రక్తదానం)తో పాటు కుమారులు కూడా ప్రతి ఏటా రక్తదానం చేస్తున్నారు. రక్తదానం ఒక సామాజిక బాధ్యత మాత్రమే కాదు... అది మానవత్వానికి అత్యున్నత రూపమని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement