లయన్స్‌కు వరుసగా మూడో ఓటమి | - | Sakshi
Sakshi News home page

లయన్స్‌కు వరుసగా మూడో ఓటమి

Jun 14 2026 10:19 AM | Updated on Jun 14 2026 10:19 AM

విశాఖ స్పోర్ట్స్‌: ఏపీఎల్‌ ఐదో సీజన్‌లో సింహాద్రి వైజాగ్‌ లయన్స్‌ వరుసగా మూడో పరాజయాన్ని చవిచూసింది. శనివారం వైఎస్సార్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భీమవరం బుల్స్‌ 104 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భీమవరం బుల్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 219 పరుగులు చేసింది. రేవంత్‌ (58), సాత్విక్‌ (69) అర్ధసెంచరీలతో రాణించారు. అనంతరం 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లయన్స్‌ బ్యాటర్లు విఫలమవడంతో జట్టు 17.5 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. బుల్స్‌ బౌలర్‌ యశ్వంత్‌ ఐదు వికెట్లు తీసి మ్యాచ్‌ను ఏకపక్షం చేశాడు. దీంతో బుల్స్‌ వరుసగా మూ డో విజయాన్ని నమోదు చేసింది.

మరో మ్యా చ్‌లో కాకినాడ కింగ్స్‌ 34 పరుగుల తేడాతో తుంగభద్ర వారియర్స్‌పై విజయం సాధించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement