మహారాణిపేట: భారత ఆర్థిక సేవ (ఇండియన్ ఎకనామిక్ సర్వీస్–ఐఈఎస్) ట్రైనీ అధికారుల కోసం విశాఖ పోర్ట్ అథారిటీ నిర్వహించిన ఐదు రోజుల ‘మారిటైమ్ ఎకానమీ అండ్ పోర్ట్ మేనేజ్‌మెంట్’ శిక్షణా కార్యక్రమం శుక్రవారం పోర్టులో ముగిసింది. ఈ నెల 8న పోర్ట్ చైర్‌పర్సన్ జె.ఎస్.బింద్రా ప్రారంభించిన ఈ శిక్షణా కార్యక్రమంలో మారిటైమ్ ఇండియా విజన్–2030, మారిటైమ్ అమృత్ కాల్ విజన్–2047, సముద్ర అనుసంధానం, బ్లూ ఫైనాన్స్, పర్యావరణ నిర్వహణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, క్రూయి జ్ టూరిజం, పీపీపీ, లాజిస్టిక్స్, రైల్వే, రోడ్డు అనుసంధానం వంటి అంశాలపై ప్రత్యేక సెషన్లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విశాఖ పోర్ట్ అథారిటీ, హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లోని వివిధ విభాగాలను సందర్శించే అవకాశాన్ని కల్పించారు. ఈ సందర్భంగా పోర్ట్ చైర్‌పర్సన్ జె.ఎస్.బింద్రా, ప్రధాన విజిలెన్స్ అధికారి అరుణ్ ప్రసాద్, కార్యదర్శి ఎం.శంకరబాబు ట్రైనీ అధికారులకు సర్టిఫికెట్లు అందజేశారు.


