ఖాకీ వనం నుంచి విద్యా క్షేత్రంలోకి.. | - | Sakshi
Sakshi News home page

ఖాకీ వనం నుంచి విద్యా క్షేత్రంలోకి..

May 21 2026 10:25 AM | Updated on May 21 2026 10:25 AM

డిగ్రీ కళాశాల అధ్యాపకుడిగా

త్రీటౌన్‌ కానిస్టేబుల్‌ ఎంపిక

బీచ్‌రోడ్డు: పోలీసు విధుల్లో నిత్యం బిజీగా ఉంటూనే, పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాన్ని చేరుకున్నారో కానిస్టేబుల్‌. నగరంలోని త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న రెడ్డి భాస్కరరావు.. ఇటీవలే ఏపీపీఎస్సీ విడుదల చేసిన డిగ్రీ కళాశాల అధ్యాపకుల ఫలితాల్లో అర్థశాస్త్ర అధ్యాపకుడిగా ఎంపికయ్యారు. ఓ వైపు కానిస్టేబుల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోవైపు ఆయన దూరవిద్య ద్వారా పీజీ పూర్తి చేశారు. అనంతరం డిగ్రీ కళాశాలల అధ్యాపక పోస్టుల కు సన్నద్ధమయ్యారు. 2025 జూలైలో జరిగిన రాత పరీక్షకు హాజరవగా.. ఈ నెల 13న ఏపీపీఎస్సీ ప్రకటించిన తుది ఫలితాల్లో ఆయన ఎకనామిక్స్‌ లెక్చరర్‌గా ఎంపికయ్యారు. భాస్కరరావును త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఉన్నతాధికారులు, తోటి సిబ్బంది అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement