ఫొటోలో కనిపిస్తున్న దృశ్యాలు చూశారుగా.. ఒకరికేమో పోలీస్ అన్నా, చట్టం అన్నా డోంట్ కేర్. పోలీసుల ముందే హెల్మెట్ లేకుండా చెవికి ఫోన్ తగిలించి దర్జాగా బైక్‌పై దూసుకుపోతున్నాడు. ఇంకొకరికేమో పోలీసులను చూడగానే ఎక్కడ లేని భయం పట్టుకుంది.. అంతే, ట్రాఫిక్‌ను బేఖాతరు చేస్తూ అడ్డంగా రాంగ్ రూట్‌లో బండిని వెనక్కి తిప్పేశారు! నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా యువతలో మాత్రం ఈ ’కేర్‌లెస్’ ఆటిట్యూడ్ మారడం లేదనడానికి కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ వద్ద ‘సాక్షి’ క్లిక్ మనిపించిన ఈ దృశ్యాలే నిదర్శనం. – ఫొటోలు: సాక్షి, ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం


