‘మహిళలకు అడుగడుగునా అవమానాలు’ | - | Sakshi
Sakshi News home page

‘మహిళలకు అడుగడుగునా అవమానాలు’

Apr 30 2026 9:30 AM | Updated on Apr 30 2026 9:30 AM

అల్లిపురం: చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలకు అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయని వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌ ప్రతినిధి పాకా సత్యనారాయణ ఒక ప్రకటనలో విమర్శించారు. 6వ అదనపు జిల్లా కోర్టు(మహిళా కోర్టు) పీపీగా నియమితులైన కళావతి అనే మహిళా న్యాయవాది నియామకాన్ని ఒక్క రోజులోనే రద్దు చేయడం దారుణమన్నారు. ఆమె స్థానంలో ఎస్‌.వి.రమణను నియమించడం మహిళల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. మహిళా కోర్టుకు మహిళా పీపీనే నియమించాల్సి ఉండగా, పురుష న్యాయవాదిని నియమించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరుగుతున్నా హోం మంత్రి అరికట్టలేకపోతున్నారని, ఇది సిగ్గుచేటని దుయ్యబట్టారు. గాజువాకలో ఒక దళిత మహిళను అతి దారుణంగా హత్య చేసి, ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన ఘటన రాష్ట్ర ప్రజలను ఉలిక్కిప డేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశా రు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ కరువైందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement