సింథియా: భారత నౌకాదళ కార్యాచరణ సామర్థ్యాలను తెలుసుకునేందుకు నౌకాదళ యుద్ధ నౌకను, జలాంతర్గామిని నాగాలాండ్ ముఖ్యమంత్రి నైఫియు రియో సందర్శించారు. ఈ సందర్భంగా తూర్పు నావికాదళ కమాండ్ ఉన్నతాధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా, ఉపరితల, జలాంతర్గత వేదికల విధులు, లక్ష్యాలు, కార్యాచరణ సామర్థ్యాల గురించి అధికారులు ఆయనకు వివరించారు. అనంతరం, ఆయన ఆ నౌకలను పరిశీలించారు. నైఫియు రియో నౌకాదళ సిబ్బందితో సంభాషించి, దేశ సముద్ర ప్రయోజనాలను పరిరక్షించడంలో వారు ప్రదర్శిస్తున్న వృత్తి నైపుణ్యం, అంకితభావం, నిబద్ధతను ప్రశంసించారు. భారత నౌకాదళం పాటిస్తున్న ఉన్నత ప్రమాణాలను, సముద్ర భద్రతను నిర్ధారించడంలో నౌకల పాత్రను ఆయన కొనియాడారు.


