ఏబీఎన్‌ రాధాకృష్ణను అరెస్టు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఏబీఎన్‌ రాధాకృష్ణను అరెస్టు చేయాలి

Apr 28 2026 8:34 AM | Updated on Apr 28 2026 8:34 AM

● రాష్ట్రంలో రాచరిక వ్యవస్థ నడుస్తోంది ● డైవర్షన్‌ రాజకీయాల్లో భాగంగానే తప్పుడు కథనాలు ● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు

సాక్షి, విశాఖపట్నం: తమ పార్టీ నేతలను, మహిళలను ఉద్దేశించి ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ..అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ నేతలు సోమవారం పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చికి ఫిర్యాదు చేశారు. ఈ నెల 9న రాధాకృష్ణ ప్రచురించిన కథనాలపై తక్షణమే కేసు నమోదు చేసి, ఆయన్ని అరెస్ట్‌ చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు నేతృత్వంలో పార్టీ శ్రేణులు సీపీని కోరారు. అనంతరం కేకే రాజు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనుమరుగై రాచరిక వ్యవస్థ నడుస్తోందని విమర్శించారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్‌ రాజకీయాలు చేస్తోందని, అందులో భాగంగానే చంద్రబాబు తనకు అనుకూలమైన మీడియాను రంగంలోకి దించుతున్నారని మండిపడ్డారు. ‘మావిగన్‌’ ద్వారా తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మించవచ్చని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సూచనను పక్కదారి పట్టించేందుకే రాధాకృష్ణ ద్వారా తప్పుడు కథనాలు రాయించారని ఆరోపించారు. ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం అధికార పార్టీ ఒత్తిడికి నిదర్శనమన్నారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ మాట్లాడుతూ రాధాకృష్ణ తీరును తీవ్రంగా ఖండించారు. ప్రజాదరణ పొందుతున్న ‘మావిగన్‌’ అక్కసుతోనే ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇలాంటి అసంబద్ధ రాతలు రాస్తున్నారని విమర్శించారు. రాధాకృష్ణను వెంటనే అరెస్ట్‌ చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ప్రజా పోరాటం చేపడతామ స్పష్టం చేశారు. కార్యక్రమంలో సమన్వయకర్తలు తిప్పల దేవన్‌ రెడ్డి, మొల్లి అప్పారావు, సీఈసీ మెంబర్‌ కోలా గురువులు, పార్టీ ముఖ్యనేతలు కె. సతీష్‌, రవి రెడ్డి, రొంగలి జగన్నాథం, కొండా రాజీవ్‌ గాంధీ, సతీష్‌ వర్మ, పేడాడ రమణి కుమారి, మంచా నాగ మలేశ్వరి, పేర్ల విజయ్‌ చందర్‌, అనిల్‌కుమార్‌ రాజు, పళ్లా దుర్గారావు, తాడి జగన్నాథరెడ్డి, జీవీ రామచంద్రరాజు, కిరణ్‌ రాజు, పోతిన శ్రీనివాస్‌, అల్లంపల్లి రాజుబాబు, ిపీవీ సురేష్‌, బిపిన్‌ కుమార్‌ జైన్‌, బోని శివరామకృష్ణ, సనపల రవీంద్ర భరత్‌, కె.రామిరెడ్డి, మనోజ్‌, బొండా ఉమామహేశ్వరరావు , రాయపురెడ్డి అనిల్‌ కుమార్‌, దేవరకొండ మార్కేండేయులు, రామన్నపాత్రుడు, రెయ్యి వెంకటరమణ, ఈశ్వర్‌రావు, జీలకర్ర నాగేంద్ర, బెవర జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement