ఇంధన కొరత ప్రభుత్వ వైఫల్యమే.. | - | Sakshi
Sakshi News home page

ఇంధన కొరత ప్రభుత్వ వైఫల్యమే..

Apr 28 2026 8:34 AM | Updated on Apr 28 2026 8:34 AM

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు

సాక్షి, విశాఖపట్నం: దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే పెట్రోల్‌, డీజిల్‌ కొరత నెలకొనడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు విమర్శించారు. సోమవారం సిరిపురంలోని పెట్రోల్‌ బంకును ఆయన సందర్శించి, ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేకే రాజు మీడియాతో మాట్లాడుతూ మూడు రోజులుగా నగరంలో ఇంధన సమస్య తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంధన కొరత లేదని కేంద్ర మంత్రులు స్పష్టం చేస్తున్నా, రాష్ట్రంలో కొరత ఉండటం వెనుక కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. పక్కనే ఉన్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఇంధన సమస్య లేనప్పుడు, కేవలం ఏపీలోనే ఎందుకు కొరత ఏర్పడిందని ఆయన నిలదీశారు. కూటమి నేతల అండతోనే డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో సమన్వయకర్తలు తిప్పల దేవన్‌ రెడ్డి, మొల్లి అప్పారావు, సీఈసీ మెంబర్‌ కోలా గురువులు, ముఖ్యనేతలు కె. సతీష్‌, కొండా రాజీవ్‌ గాంధీ, రొంగలి జగన్నాథం, పేడాడ రమణికుమారి, పేర్ల విజయ్‌ చందర్‌, తాడి జగన్నాఽథ్‌ రెడ్డి, పళ్లా దుర్గారావు, జీవీ రామచంద్రరాజు, కిరణ్‌ రాజు, పోతిన శ్రీనివాస్‌, అల్లంపల్లి రాజుబాబు, పీవీ సురేష్‌, అనిల్‌ కుమార్‌ రాజు, బిపిఎన్‌ కుమార్‌ జైన్‌, శివ రామ కృష్ణ, మనోజ్‌, కర్రి రామిరెడ్డి, బొండా ఉమామహేశ్వరరావు, ఆర్‌. అనిల్‌ కుమార్‌, సనపల రవింద్ర భరత్‌, దేవరకొండ మార్కేండేయులు, ఈశ్వరరావు, మెరవ గణేష్‌, రామన్న పాత్రుడు, మువ్వల సురేష్‌, సూర్యనారాయణ, విక్టర్‌, జీలకర్ర నాగేంద్ర పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement