ఏయూ శతాబ్ది ఉత్సవాల వేళ.. విశాఖకు చెందిన అంతర్జాతీయ ఎగ్ స్కల్ప్చర్ ఆర్టిస్ట్ శిలపరశెట్టి దుర్గా శంకర్ తన సృజనాత్మకతతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎటువంటి పెయింటింగ్స్ ఉపయోగించకుండా కేవలం ఎచ్చింగ్ పద్ధతి ద్వారా ఈము పక్షి గుడ్డుపై ఏయూ లోగోతో పాటు సింహాద్రి అప్పన్న రూపాన్ని అత్యంత సునిశితంగా చెక్కారు. ఈ అరుదైన కళాఖండాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి లోకేష్‌లకు బహుకరించనున్నట్టు శంకర్ చెప్పాడు.. రాష్ట్రంలో ‘ఎగ్ ఆర్ట్ మ్యూజియం’ ఏర్పాటు చేయాలనే తన చిరకాల కోరికను వారి ముందు ఉంచనున్నట్లు దుర్గా శంకర్ పేర్కొన్నాడు.
– సీతంపేట


