అల్లిపురం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు, గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమాల కోసం నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో 1,950 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా ఎయిర్‌పోర్ట్ నుంచి వేదికల వరకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. వీఐపీ ప్రాంతాల్లో బాంబు, స్నిఫర్ డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహిస్తూ, ప్రతి విభాగానికి ఒక ఉన్నతాధికారిని పర్యవేక్షకులుగా నియమించి ఈ కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.


