ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి

Apr 27 2026 8:24 AM | Updated on Apr 27 2026 8:24 AM

అల్లిపురం: ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పప్పల అమ్మన్నమ్మ (72) అనే వృద్ధురాలు మృతి చెందింది. శ్రీకాకుళం జిల్లా సరిబుజ్జిలి మండలం బదలాయిపేటకు చెందిన అమ్మన్నమ్మ, తన కుమార్తె భానుతో కలిసి నగరంలో ఉంటున్న కుమారుడి ఇంటికి వచ్చింది. కాంప్లెక్స్‌లో బస్సు దిగిన తర్వాత, కుమార్తె ఆటో కోసం ప్రయత్నిస్తుండగా, అమ్మన్నమ్మ వాష్‌రూమ్‌ కోసం వెళ్తుండగా ఇచ్ఛాపురం నుంచి వచ్చిన బస్సు ఆమెను ఢీకొట్టింది. బస్సు చక్రాలు ఆమైపె నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న టూటౌన్‌ ట్రాఫిక్‌ ఎస్‌.ఐ. సింహాచలం ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement