ఈ ప్రాంత అస్తిత్వం, అభివృద్ధిని కాంక్షించి ఏయూ ఆవిర్భవించింది. సంస్థానాధీశులు తమ భూములను దానం చేసి, ఆర్థికంగా అండగా నిలిచి ఈ విద్యాలయాన్ని నిర్మించారు. ఎంతోమంది మేధావులను, న్యాయమూర్తులను, రాజ్యాంగపరమైన ఉన్నత పదవులను అధిష్టించిన మహనీయులను అందించిన ఘనత ఏయూది. అయితే, నేడు అటువంటి వారెందరికో తగిన గుర్తింపు లభించకపోవడం విచారకరం. వర్సిటీపై రాజకీయ ప్రభావం పెరగడం సంస్థ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. చారిత్రక వారసత్వాన్ని కాపాడుకుందాం.
– విశ్వ, పీడీఎస్‌యూ నాయకుడు


