ఏయూలో చదువుకున్న మేధావులను, పూర్వ విద్యార్థులను విస్మరించి, ప్రైవేటు వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం సరైన పద్ధతి కాదు. శతాబ్ది ఉత్సవాలను మొక్కుబడి తంతుగా నిర్వహించడం బాధాకరం. ఇది స్థానిక ప్రజల ఆత్మగౌరవంపై జరుగుతున్న వివక్షే. భవిష్యత్ తరాలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే ప్రగతిశీల ఆలోచనలు లోపించాయి. జరగకూడని రీతిలో ఈ ఉత్సవాలు జరుగుతుండటం బాధాకరం.
– డాక్టర్ బి. గంగారావు,
సీపీఎం మాజీ ఫ్లోర్ లీడర్


