స్థానికత అనేది మన ఆత్మాభిమానం. మన ఉనికిని కాపాడుకోవాల్సిన అస్తిత్వ పోరాటం ఇది. ఈ ప్రాంతాన్ని కళింగసీమగా గుర్తిస్తూ వెంటనే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలి. అన్ని రాజకీయ పార్టీలు స్థానికుల పట్ల సానుకూల చొరవ చూపాలి. వందేళ్ల ఘన చరిత్ర కలిగిన ఏయూ ప్రతిష్ట దిగజారేలా కార్యక్రమాలు చేయడం మానుకోవాలి. మన గౌరవానికి ప్రతీకై న విద్యా సంస్థల పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– డాక్టర్ జీవితేశ్వరరావు, ప్రముఖ వైద్యులు
కేంద్ర వర్సిటీ హోదా
కల్పించాలి
విశ్వవిద్యాలయాలకు కేవలం విద్యను అందించడమే కాకుండా, పటిష్టమైన సామాజిక బాధ్యత కూడా ఉండాలి. వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏయూను తక్షణమే కేంద్ర విశ్వవిద్యాలయంగా ప్రకటించాలి. పరిశోధనలు ప్రజల అభివృద్ధి కోసం జరగాలి. అప్పుడే విద్యాసంస్థల ఉనికికి సార్థకత లభిస్తుంది.
– డాక్టర్ మాటూరి శ్రీనివాస్,
సమతా సాహితీ అధ్యక్షుడు
పేలవంగా శతాబ్ది ఉత్సవాలు
ఏయూలో బోధన, పరిశోధనలు దారుణంగా పడిపోయాయి. 1,200 మంది అధ్యాపకులు ఉండాల్సిన చోట కేవలం 130 మందితో నెట్టుకొస్తున్నారు. నిబంధనల ప్రకారం 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలి. 90 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా కలిగిన ఈ ప్రాంత ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. వందేళ్ల ప్రగతిని ప్రపంచానికి చాటాల్సిన తరుణంలో అత్యంత పేలవంగా ఉత్సవాలు నిర్వహించడం విచారకరం.
– వెంకటరావు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు


