నేడు గవర్నర్‌ రాక | - | Sakshi
Sakshi News home page

నేడు గవర్నర్‌ రాక

Apr 26 2026 5:03 AM | Updated on Apr 26 2026 5:03 AM

మహారాణిపేట: రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం విశాఖపట్నం రానున్నారు. ఆదివారం రాత్రి 8.35 గంటలకు విజయవాడ నుంచి విమానంలో విశాఖ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా నోవాటెల్‌ హోటల్‌కు చేరుకుని బస చేస్తారు. 27న ఉదయం 9.45 గంటలకు హోటల్‌ నుంచి బయలుదేరి ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకుంటారు. అక్కడ భారత ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికి, అనంతరం తిరిగి హోటల్‌కు చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం 3.20 గంటలకు ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానానికి చేరుకుని, అక్కడ నిర్వహించే ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. 28న సాయంత్రం విశాఖ విమానాశ్రయం నుంచి విమానంలో విజయవాడకు బయలుదేరుతారు.

Advertisement
 
Advertisement
Advertisement