జీవీఎంసీ కమిషనర్‌తో
వైఎస్సార్ సీపీ రాష్ట్ర
మహారాణిపేట: విశాఖలో నడకపై పన్ను విధిస్తూ.. ప్రజలను నిలువు దోపిడీ చేసేందుకు సిద్ధమైన చంద్రబాబు ప్రభుత్వం, ఇప్పుడు జీవీఎంసీ కమిషనర్‌తో సత్యదూరమైన మాటలు మాట్లాడిస్తోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో నడిచినా పన్ను కట్టాలన్న ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తమవుతోందన్నారు. దీంతో ప్రభుత్వం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌తో వివరణ ఇప్పించిందని పేర్కొన్నారు. నడకపై పన్ను అనేది అవాస్తవమని, అది కేవలం దుష్ప్రచారమేనని, ఎవరైనా పన్ను అడిగితే ఫిర్యాదు చేయాలని కమిషనర్ చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. ‘ఒక వేళ కమిషనర్ చెప్పింది నిజమే అయితే, పార్కులు, స్టేడియంల వద్ద నోటీసులు, ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారు? ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడం కాదా?’ అని ప్రశ్నించారు. తక్షణమే పార్కులు, స్టేడియంల వద్ద ఏర్పాటు చేసిన నోటీసులను, ఫ్లెక్సీలను తొలగించాలన్నారు. కమిషనర్ అనుమతి లేకుండా, ఆయన పేరు మీద నోటీసులు పెట్టిన వారిపై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అబద్ధాలు చెప్పిస్తున్నారు
అధికార ప్రతినిధి
రాజీవ్ గాంధీ


