ప్రస్తుతానికి ఇబ్బంది లేదు.. కానీ.. | - | Sakshi
Sakshi News home page

ప్రస్తుతానికి ఇబ్బంది లేదు.. కానీ..

Apr 25 2026 9:18 AM | Updated on Apr 25 2026 9:18 AM

ప్రస్తుత నిల్వలను పాత ధరలకే విక్రయిస్తున్నప్పటికీ, సమీప భవిష్యత్తులో జనరిక్‌, అత్యవసర మందుల ధరలు పెరిగే అవకాశం ఉంది. దుబాయ్‌ వంటి పశ్చిమాసియా కేంద్రాల నుంచి దిగుమతి చేసుకునే ముడిసరుకు ధరలు విపరీతంగా పెరగడంతో తయారీ సంస్థలు ధరల నిర్మాణాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికి మందుల నిల్వలు సరిపడా ఉన్నప్పటికీ, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు ఇబ్బందులు తప్పవు. మందుల తయారీకి అవసరమైన పెట్రో రసాయనాలపై దిగుమతి సుంకాలను కేంద్ర ప్రభుత్వం జూన్‌ చివరి వరకు రద్దు చేసినా, యుద్ధం ఆగితే తప్ప పరిస్థితులు చక్కబడవు. ప్రస్తుతానికై తే సరఫరా సంక్షోభం తలెత్తకుండా హోల్‌సేల్‌ వ్యాపారులంతా తగినంత స్టాక్‌ నిర్వహిస్తున్నారు.

– గ్రంథి వీరవెంకట నాగ సుమన్‌, కార్యదర్శి, వైజాగ్‌ మెడికల్‌ హోల్‌సేల్‌ అసోసియేషన్‌

Advertisement
 
Advertisement
Advertisement