ఐఐఏఎంలో వీసీల సదస్సు | - | Sakshi
Sakshi News home page

ఐఐఏఎంలో వీసీల సదస్సు

Apr 25 2026 9:18 AM | Updated on Apr 25 2026 9:18 AM

ఎంవీపీ కాలనీ: ఎంవీపీ కాలనీలో ఇంటిగ్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఏఎం) వేదికగా నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ –2020పై ఉపకులపతుల సదస్సు శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో ఉన్నత విద్యా సంస్థల్లో అవసరమైన మార్పులపై ప్రసంగించారు. ఈ సందర్భంగా సెంచూరియన్‌ యూనివర్సిటీ కులపతి ఆచార్య జీఎస్‌ఎన్‌ రాజు మాట్లాడుతూ దేశ విద్యా వ్యవస్థ డిగ్రీల ఆధారిత విధానం నుంచి నైపుణ్యాల ఆధారిత విధానంగా రూపాంతరం చెందిందన్నారు. విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులను ఎంచుకొని, ఉత్తమ నైపుణ్యత పొందడమే ఈ విధానం ప్రధాన లక్ష్యమన్నారు. అనంతరం ఐఐఏఎం గ్రూప్‌ చైర్మన్‌ డాక్టర్‌ సుంకరి రవీంద్ర, మాజీ వీసీలు, ప్రొఫెసర్లు కేఎస్‌ చలం, బాలమోహన్‌దాస్‌, నాగేశ్వరరావు, లజపతిరాయ్‌, జార్జివిక్టర్‌, సుధాకర్‌, ప్రసాద్‌ , ఐఐఏఎం డైరెక్టర్‌ జనరల్‌ ప్రొఫెసర్‌ కృష్ణమోహన్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement