న్యూస్‌రీల్
ఒక్కసారిగా పెరిగిన ఔషధ ముడి పదార్థాల ధరలు ఎర్ర సముద్రంలో నౌకాయాన ఆటంకాలే కారణం పారాసిటమాల్ ముడిసరకు ధర 96 శాతం పెరుగుదల మధుమేహ, యాంటీబయాటిక్స్ తయారీపైనా భారం
8లో
ఔషధాలకు సెగ
తుపాకీ గుళ్లు అక్కడ పేలుతుంటే.. ఇక్కడ మధ్యతరగతి రోగి గుండె గుభేల్ మంటోంది. సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులు కదులుతుంటే.. ఇళ్లలో మందుల డబ్బాలు ఖాళీ అవుతున్నాయి. ఎర్ర సముద్రంలో నౌకల రాకపోకలకు పడిన బ్రేక్.. ఇప్పుడు దేశీయ ఔషధ రంగానికి ‘ప్రాణసంకటం’గా మారింది. జ్వరం వస్తే వేసుకునే పారాసిటమాల్ నుంచి ప్రాణం నిలిపే యాంటీబయాటిక్స్ వరకు.. ముడి పదార్థాల ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో సామాన్యుడి మందుల చిట్టీ ‘మందుపాతర’లా మారుతోంది. యుద్ధం దేశాల మధ్య జరుగుతుంటే.. ఆరోగ్య రక్షణ కోసం పేదవాడు తన జేబుతో యుద్ధం చేయాల్సిన దుస్థితి దాపురించింది.
నేడు పాలిసెట్
మందుల పెట్టె.. ‘మందు’పాతర


