అల్లిపురం: విధి నిర్వహణలో ఉండగా మరణించిన సీతమ్మధార ఎకై ్సజ్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఎల్.ఎస్.నాయుడు మృతి పట్ల రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. శుక్రవారం వీఎంఆర్‌డీఏ కాంప్లెక్స్‌లో గల జిల్లా సూపరింటెండెంట్ కార్యాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల ఎకై ్సజ్ అధికారులతో ఎకై ్సజ్ కమిషనర్ శ్రీధర్ చామకూరి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభానికి ముందు అధికారులు రెండు నిమిషాలు మౌనం పాటించి నాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సీఐ స్థాయి నుంచి డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులతో స్టేషన్ల వారీగా పనితీరుపై చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కమిషనర్ కేజీహెచ్‌కు వెళ్లి మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు
ప్రభుత్వం, శాఖ తరఫున సాయం
మంత్రి కొల్లు రవీంద్ర ఒక ప్రకటన విడుదల చేస్తూ.. మృతుని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి తక్షణ సహాయంగా ఎకై ్సజ్ శాఖ నుంచి రూ. 10 లక్షలు, ఎస్బీఐ ఇన్సూరెన్స్ విభాగం నుంచి రూ. 1.10 కోట్లు అందుతాయని పేర్కొన్నారు. కుటుంబంలో అర్హులైన వారికి కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు.


