మర్రిపాలెం: ఒక ద్విచక్ర వాహనాన్ని మరో బైక్ బలంగా ఢీకొన్న ప్రమాదంలో ఎకై ్సజ్ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందగా, మరో ఇద్దరు యువకులు గాయపడ్డారు. ఈ ఘటన కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాలివి.. గురువారం అర్ధరాత్రి సుమారు 12.30 గంటల సమయంలో సీతమ్మధారలోని ఎకై ్సజ్ కార్యాలయంలో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ లగుడు సింహాచలం నాయుడు.. పని నిమిత్తం తాటిచెట్లపాలెం నుంచి ఊర్వశి జంక్షన్ వైపు తన బైక్‌పై వెళ్తున్నారు. జాతీయ రహదారిపై వెళ్తున్న క్రమంలో, వెనుకనే అతివేగంగా వచ్చిన మరో బైక్ ఆయన వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సింహాచలం నాయుడు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో ఆయన్ని కేజీహెచ్‌కు తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆయన కొద్దిసేపటికే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన మరో బైక్‌పై ఉన్న దేవుపల్లి కార్తీక్, బొట్ట శ్రీకాంత్ కూడా గాయపడటంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కంచరపాలెం ట్రాఫిక్ సీఐ పి.రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


