విశాఖ స్పోర్ట్స్: అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తున్న మహ్మద్ షబ్నం, అంధుల ప్రపంచ క్రికెట్‌లో సత్తా చాటిన కరుణకుమారిలను ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఘనంగా సత్కరించారు. ఆర్వీవీకే 80వ జయంతి సందర్భంగా గురువారం స్థానికంగా నిర్వహించిన కార్యక్రమంలో వీరిద్దరికీ చెరో రూ.10 వేల నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఆర్వీవీకే స్మారక క్రికెట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వీడీసీఏ ప్రతినిధులు పార్థసారథి, సుధాకర్, డి.ఎస్.వర్మ తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారిణులు మరిన్ని విజయాలు సాధించి నగరానికి, దేశానికి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.


