75 వేల మంది సామర్థ్యంతో.. | - | Sakshi
Sakshi News home page

75 వేల మంది సామర్థ్యంతో..

Apr 24 2026 5:50 AM | Updated on Apr 24 2026 5:50 AM

ప్రస్తుతం విశాఖ నుంచి నిత్యం 110 నుంచి 130 రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా, అందులో దాదాపు 40 రైళ్లు ఇక్కడి నుంచే బయలుదేరుతున్నాయి. భవిష్యత్తులో ఈ సంఖ్య 50 నుంచి 75 శాతం మేర పెరిగే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా ప్లాట్‌ఫాంలను టెర్మినల్‌ తరహాలో 650 నుంచి 1000 మీటర్ల పొడవుతో నిర్మిస్తున్నారు. దీని వల్ల 24 కోచ్‌లకు పైగా ఉన్న సుదీర్ఘ రైళ్లను కూడా సులభంగా నిలిపే వీలుంటుంది. ప్రస్తుతం రోజుకు 45 వేల నుంచి 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా, ఆధునికీకరణ పనులు పూర్తయితే ఆ సామర్థ్యం 75 వేల నుంచి 90 వేల వరకు పెరగనుంది.

Advertisement
 
Advertisement
Advertisement