వేసవిలో ప్రత్యేక రైళ్లు | - | Sakshi
Sakshi News home page

వేసవిలో ప్రత్యేక రైళ్లు

Apr 24 2026 5:50 AM | Updated on Apr 24 2026 5:50 AM

తాటిచెట్లపాలెం: వేసవి రద్దీ దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్ధం పలు మార్గాలలో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్‌ డివిజన్‌, అధికారులు తెలిపారు.

● ముజఫర్‌పూర్‌–మైసూరు (06244) సమ్మర్‌ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 25వ తేదీ శనివారం రాత్రి 10.45 గంటలకు ముజఫర్‌పూర్‌లో బయల్దేరి సోమవారం ఉదయం 6.43 గంటలకు కొత్తవలసకు, మంగళవారం ఉదయం 7.45గంటలకు మైసూరు చేరుకుంటుంది.

● మచిలీపట్నం– ఖరగ్‌పూర్‌(07691) సమ్మర్‌ స్పెషల్‌ ఈ నెల 24వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి అదేరోజు రాత్రి 7.50 గంటలకు దువ్వాడకు, మరుసటిరోజు శనివారం ఉదయం 11 గంటలకు ఖరగ్‌పూర్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఖరగ్‌పూర్‌–మచిలీపట్నం (07692) సమ్మర్‌ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఖరగ్‌పూర్‌లో ఈ నెల 25వ తేదీ శనివారం మధ్యాహ్నం 1 గంటకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 5.30 గంటలకు దువ్వాడకు, అదే రోజు సాయంత్రం 3 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది.

● చర్లపల్లి–ఖరగ్‌పూర్‌(07693) సమ్మర్‌ స్పెషల్‌ ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 6.25 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి అదేరోజు రాత్రి 7.33గంటలకు దువ్వాడకు, మరుసటిరోజు సోమవారం ఉదయం 10 గంటలకు ఖరగ్‌పూర్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఖరగ్‌పూర్‌–చర్లపల్లి (07694) సమ్మర్‌ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఖరగ్‌పూర్‌లో ఈ నెల 27వ తేదీ సోమవారం సాయంత్రం 4.30గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 5.35గంటలకు దువ్వాడకు, అదే రోజు రాత్రి 6.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement