ఈపీడీసీఎల్‌లో ముగిసిన నీతి ఆయోగ్‌ వర్క్‌షాప్‌ | - | Sakshi
Sakshi News home page

ఈపీడీసీఎల్‌లో ముగిసిన నీతి ఆయోగ్‌ వర్క్‌షాప్‌

Apr 23 2026 8:36 AM | Updated on Apr 23 2026 8:36 AM

విశాఖ సిటీ: ఏపీఈపీడీసీఎల్‌ ఆధ్వర్యంలో నీతి ఆయోగ్‌ ప్రతినిధులతో కలిసి బుధవారం విశాఖలోని ఐటీ బిల్డింగ్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో నీతి ఆయోగ్‌ వర్క్‌షాప్‌ నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్‌ పంపిణీ రంగాన్ని మరింత సమర్థవంతంగా, వినియోగదారులకు అనుకూలంగా, ఆర్థికంగా, స్థిరంగా మార్చే చర్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీఎండీ పృథ్వీతేజ్‌ ఇమ్మడి, నీతి ఆయోగ్‌ సభ్యులు రోని ఖన్నా, సుష్రూత్‌ హెల్వాత్కర్‌, వివేక్‌ థక్కర్‌, పి.అభిరామ్‌, డైరెక్టర్లు టి.వి.సూర్యప్రకాష్‌, టి.వనజ, ఎస్‌.హరిబాబు, సీఎజీఎంలు, ట్రాన్స్‌కో అధికారులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యుత్‌ పంపిణీ సంస్థల్లో అమలు చేయాల్సిన ప్రాజెక్టులు, భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికలు, మెరుగైన ఫలితాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. విద్యుత్‌ సరఫరా నాణ్యత మెరుగుదలతో పాటు రుణ పునర్‌వ్యవస్థీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణపై కూడా చర్చించారు. అన్ని విభాగాల మధ్య సమన్వయం పెంపొందిస్తూ, కార్యక్రమాల అమలుకు వర్క్‌స్ట్రీమ్‌ బాధ్యతలను ఖరారు చేసి, మానిటరింగ్‌ విధానం, రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేయాలని, దీని అమలుకు ప్రత్యేక వర్కింగ్‌ గ్రూపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌కో ఎస్‌ఈలు శివరామకృష్ణ, నరసింహారావు, సీజీఎంలు వి.విజయలలిత, డి.సుమన్‌ కల్యాణి, బి.అశోక్‌ కుమార్‌, ఎల్‌.మహేంద్రనాథ్‌, ఎస్‌.రాజబాబు, ఎస్‌.విజయ్‌ప్రతాప్‌, ఎల్‌.దైవప్రసాద్‌, వి.జనార్ధనరావు, వి.వి.ఎస్‌.ఎన్‌.వి. ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement