నడకపై పన్ను తుగ్లక్‌ పాలనకే నిదర్శనం | - | Sakshi
Sakshi News home page

నడకపై పన్ను తుగ్లక్‌ పాలనకే నిదర్శనం

Apr 23 2026 7:18 AM | Updated on Apr 23 2026 7:18 AM

సీతంపేట: వాకర్స్‌పై పన్ను విధించడం తుగ్లక్‌ పాలనను మించిందని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌ విమర్శించారు. బుధవారం స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియం ఎదుట సీపీఎం నాయకులు నిరసన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్‌ సిటీ పేరిట నడకపై పన్నులు వేయడం విధించడం అన్యాయమన్నారు. పార్కులు, స్టేడియంలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం ప్రజా వ్యతిరేక చర్యగా పేర్కొన్నారు. వెంటనే యూజర్‌ చార్జీలను రద్దు చేయకపోతే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ిసీపీఎం జోన్‌ కార్యదర్శి వి.కృష్ణారావు, నాయకులు కె.కుమార్‌, ఎల్‌.జె.నాయుడు, జె.ఆర్‌.నాయుడు, చంద్రమౌళి, ఎన్‌.వి.రమణ, ఆర్‌ శ్రీను, హైమ, చలపతి, దండు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement