తోడల్లుడికి కోట్ల భూములా? | - | Sakshi
Sakshi News home page

తోడల్లుడికి కోట్ల భూములా?

Apr 23 2026 7:18 AM | Updated on Apr 23 2026 7:18 AM

ప్రభుత్వ భూములను దోచుకోవడానికి లైసెన్స్‌ ఇచ్చినట్లుగా గీతం వ్యవహరిస్తోంది. జీవీఎంసీలో కార్పొరేటర్లు, మీడియా గొంతునొక్కి అక్రమంగా తీర్మానం చేయించుకున్నారు. అసలు ఏ అనుమతులు ఉన్నాయని ఆ భూముల్లో నిర్మాణాలు చేపడుతున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. లోకేష్‌కు తోడల్లుడు అనే ధీమాతోనే ఈ అక్రమాలకు పాల్పడుతున్నారా? రాష్ట్రంలో ఇన్ని అక్రమాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఒకవైపు భూదోపిడీ, మరోవైపు విద్య పేరుతో ఫీజుల దోపిడీ సాగుతున్నాయి. స్టీల్‌ ప్లాంట్‌, ఏయూ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యమైనా పర్వాలేదు కానీ, తమ ప్రైవేటు సంస్థలు మాత్రం దోపిడీ చేస్తూ వర్ధిల్లాలని వీరంతా కోరుకుంటున్నారు.

– గుడివాడ అమర్‌నాథ్‌, మాజీ మంత్రి

Advertisement
 
Advertisement
Advertisement