విశాఖ ఎంపీ భరత్‌కు రూ.5 వేల కోట్ల విలువైన భూములను కట్టబెట్టడమే కాకుండా, ఆ భూముల బదలాయింపు కోసం రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా జీవీఎంసీలో తీర్మానం చేశారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను తొలగించారంటే వారి అహంకారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్యాసంస్థలకు ప్రభుత్వ భూములను కేటాయించినప్పుడు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 25 శాతం సీట్లు కేటాయించాలనే నిబంధన ఉంది. కానీ గీతం ఆ నిబంధనను పూర్తిగా తుంగలో తొక్కుతోంది. దీనికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు చేపట్టిన నిరసనకు వైఎస్సార్ సీపీ సంఘీభావం తెలుపుతుంది. అమరావతే సర్వస్వం అన్నట్లుగా మాట్లాడుతున్న కుహనా మేధావులు, విశాఖకు జరుగుతున్న ఈ అన్యాయంపై ఎందుకు నోరు విప్పడం లేదు?
– కేకే రాజు, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ


