రాష్ట్రంలో సంపద సృష్టిస్తామని వాగ్దానాలు చేసిన వారు, నేడు ఉన్న సంపదను హారతి కర్పూరంలా హరించివేస్తున్నారు. గీతం దోపిడీ కొన్నేళ్లుగా నిరాటంకంగా కొనసాగుతోంది. ఫీజుల వసూళ్లలో గానీ, విద్యార్థుల విషయంలో గానీ, భూముల ఆక్రమణలో గానీ ఎటు చూసినా దోపిడీయే కనిపిస్తోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సర్వే చేయించి వీరి కబ్జాలను అడ్డుకుంటే, నేడు అధికార అండతో వాటిని క్రమబద్ధీకరించుకుంటున్నారు. గతంలో వైఎస్ జగన్ విశాఖ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్లు సిద్ధం చేస్తే, వాటిని వక్రీకరించి కుట్రలు చేశారు. గీతం భూదోపిడీపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం.
– మళ్ల విజయ ప్రసాద్, పశ్చిమ సమన్వయకర్త


