54.79 ఎకరాల భూదోపిడీని క్రమబద్ధీకరించుకోవడానికి కార్పొరేటర్లను సంతలో పశువుల్లా కొనుగోలు చేశారు. గీతం సంస్థ ఏమైనా పేదలకు ఉచితంగా విద్యను అందిస్తోందా? వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆ సంస్థకు ఎందుకు అప్పనంగా కట్టబెడుతున్నారు? స్వయంగా ఎంపీ భరత్ ఇది రూ.5 వేల కోట్ల భూమి కాదు, వెయ్యి కోట్ల భూమి అని ఒప్పుకున్నారు. అంటే వెయ్యి కోట్ల విలువైన ప్రజా ఆస్తిని అడ్డగోలుగా కొట్టేస్తారా?
– మొల్లి అప్పారావు, తూర్పు సమన్వయకర్త


