జేఈఈ మెయిన్స్‌లో శ్రీవిశ్వ విజయభేరి | - | Sakshi
Sakshi News home page

జేఈఈ మెయిన్స్‌లో శ్రీవిశ్వ విజయభేరి

Apr 22 2026 8:00 AM | Updated on Apr 22 2026 8:00 AM

సీతంపేట: జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో శ్రీవిశ్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు విజయభేరి మోగించారు. వివిధ కేటగిరిల్లో కప్పల జాహ్నవి 97వ ర్యాంకు, శిర్ల జస్వంత్‌ 133, గోరు కుష్వంత్‌ 608, వి.మోహన్‌వంశీ 611, మేడిశెట్టి తాతాజీ 863, జల్లు చరణ్‌తేజ 873, మూల ఇంద్రకార్తీక్‌ 1000 ర్యాంకులు సాధించారు. వెయ్యిలోపు ఏడుగురు, 5వేల లోపు 31 మంది, 10వేల లోపు 43 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారు. 165 మందికి పైగా ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీల్లో సీట్లు పొందే ర్యాంకులు సాధించడం విశేషం. అలాగే 362 మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారు. మంగళవారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపక బృందాన్ని సంస్థ చైర్మన్‌ కె.ధర్మరాజు, డైరెక్టర్‌ పి.సూర్యనారాయణ అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement