కళాభారతిలో నాటకోత్సవాలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

కళాభారతిలో నాటకోత్సవాలు ప్రారంభం

Apr 13 2026 7:14 AM | Updated on Apr 13 2026 7:14 AM

మద్దిలపాలెం: విశాఖ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం పైడా కౌశిక్‌ నాటకోత్సవాలు కళాభారతి ఆడిటోరియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. వీటిని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటకాల ద్వారా చక్కటి సందేశాలను సమాజానికి అందించవచ్చన్నారు. అటువంటి నాటక కళను, కళాకారులను ప్రోత్సహిస్తూ నిర్వహిస్తున్న ఈ నాటకోత్సవాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. తొలి రోజు ప్రదర్శించిచన రెండు ప్రదర్శనలు అందరినీ ఆలోచింపజేశాయి. కార్యక్రమంలో కళాభారతి కార్యదర్శి డాక్టర్‌ రాంబాబు, పైడా కృష్ణప్రసాద్‌, ఆర్‌.హెచ్‌.నారాయణ, సుసర్ల రామ్‌గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement