ఎండాడ కొండపై అగ్ని ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

ఎండాడ కొండపై అగ్ని ప్రమాదం

Apr 12 2026 2:54 AM | Updated on Apr 12 2026 2:54 AM

మధురవాడ: ఎండాడ లా కాలేజి రోడ్డును ఆనుకుని ఉన్న ఎండాడ సర్వే నెంబరు–1లోని కొండపై శనివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు 10 ఎకరాలు మేర కొండ ప్రాంతం అగ్నికి కాలి బూడిదైపోయింది. స్థానికుల ఫిర్యాదుతో అటవీశాఖ సహాయ డీఎఫ్‌వో శ్రీవాణి సిబ్బందితో సంఘటన స్థలికి చేరుకుని మంటలు ఆర్పించే ప్రయత్నం చేశారు. శనివారం రాత్రి కూడా మంటలు కొండ ప్రాంతంలో కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

పేకాట శిబిరమే కారణమా..!

ఈ కొండపై ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పేకాట శిబిరానికి వెళ్లిన వారు పడేసిన అగ్ని వలనే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement