విశాఖ లీగల్ : న్యాయవాదుల సంఘం వార్షిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం ముగిసింది. అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి పదవులకు నాలుగేసి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ పూర్తయిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల 28వ తేదీన ప్రకటిస్తారు. ఏప్రిల్ 10వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల అధికారి ఎ.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. అభ్యర్థులందరూ ఎన్నికల నియమాలు పాటిస్తూ ప్రచారం కొనసాగించాలని కోరారు.


