శ్రీకాళహస్తి దేవస్థానం ఈఈగా శ్రీనివాసరాజు నియామకం
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి.జి.శ్రీనివాసరాజుపై ఉన్న సస్పెన్షన్‌ని ప్రభుత్వం ఎత్తివేసింది. హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శి ఎం.హరిజవహర్‌లాల్ బుధవారం జీవో నెంబరు 459 జారీ చేశారు. గత ఏడాది ఏప్రిల్ 30న చందనోత్సవం రోజు నాసిరకంగా నిర్మించిన గోడ కూలిపోవడంతో ఏడుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. దానికి బాధ్యులుగా చేస్తూ దేవస్థానం ఈఈ శ్రీనివాసరాజుతో పాటు దేవస్థానానికి చెందిన ఇన్‌చార్జి డిప్యూటీ ఈఈ, ఏఈ, ప్రసాద్ పథకం పనులు చేస్తున్న టూరిజంశాఖ ఈఈ, డీఈ, ఏఈలను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అప్పటినుంచి సుమారు ఏడాదిపాటు నుంచి విచారణ నడుస్తోంది. సస్పెన్షన్ జరిగి ఏడాది సమీపిస్తుండటంతో శ్రీనివాసరాజు హైకోర్టును కూడా ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు శ్రీనివాసరాజుపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ప్రభుత్వం జీవో జారీచేసింది. అంతేకాకుడా శ్రీకాళహస్తి దేవస్థానం ఈఈగా శ్రీనివాసరాజును నియమించింది.


