మాస్టర్స్‌ ఇంటర్నేషనల్‌లో మెరిసిన ‘వావ్‌’ అథ్లెట్స్‌ | - | Sakshi
Sakshi News home page

మాస్టర్స్‌ ఇంటర్నేషనల్‌లో మెరిసిన ‘వావ్‌’ అథ్లెట్స్‌

Mar 10 2026 7:09 AM | Updated on Mar 10 2026 7:09 AM

మురళీనగర్‌: థాయిలాండ్‌లో ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించిన 30వ థాయిలాండ్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఇంటర్నేషనల్‌ మీట్‌లో విశాఖపట్నానికి చెందిన వెటరన్‌ అథ్లెటిక్స్‌ తమ ప్రతిభను చాటారు. ఈ పోటీల్లో పాల్గొన్న 13 మంది అథ్లెట్స్‌ మొత్తం 12 పతకాలు సాధించి సత్తా చాటారు. వీటిలో 3 బంగారు, 4 రజిత, 5 కాంస్య పతకాలు ఉన్నాయని వైజాగ్‌ వెటరన్‌ అథ్లెట్స్‌ అసోసియేషన్‌ సమన్వయకర్త సీహెచ్‌. శ్రీనివాసరాజు తెలిపారు.

విజేతలు వీరే..

● నగరానికి చెందిన మాజీ పోలీస్‌ అధికారి డి.వి.ఎస్‌.భాస్కర్‌రాజు (75+) విభాగంలో రజిత పతకం సాధించడంతో పాటు 4 ్ఠ400 మీటర్ల రిలేలో కూడా రజిత పతకం గెలుచుకున్నారు.

● జి.సీతారామ్‌ (50+) 4 ్ఠ100 మీటర్ల పరుగులో కాంస్య పతకం సాధించారు.

● జి.సందీప్‌ (35+) 1500 మీటర్ల పరుగులో బంగారు పతకం, 800 మీటర్ల పరుగులో కాంస్య పతకం, 4 ్ఠ400 మీటర్ల రిలేలో రజిత పతకం గెలుచుకున్నారు.

● ఆర్‌.మంజునాథ్‌ (40+) 1500 మీటర్ల పరుగులో కాంస్య పతకం, 4 ్ఠ400 మీటర్ల రిలేలో రజిత పతకం సాధించారు.

● పి.సి.సన్యాసిరావు (85+) 100 మీటర్ల పరుగులో బంగారు పతకం, 200 మీటర్ల పరుగులో బంగారు పతకం, లాంగ్‌ జంప్‌లో కాంస్య పతకం, ట్రిపుల్‌ జంప్‌లో కాంస్య పతకం గెలుచుకున్నారు.

● బి.వింధ్యరేఖ (65+) 4 ్ఠ400 మీటర్ల రిలేలో రజిత పతకం సాధించారు.

● ఇండియా మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ సెక్రటరీ జనరల్‌, ఇండియా టీమ్‌ మేనేజర్‌ డాక్టర్‌ మంగ వరప్రసాద్‌ ఆధ్వర్యంలో ఈ అథ్లెట్లు పోటీల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విజేతలను వావ్‌ చీఫ్‌ పేట్రన్‌ డాక్టర్‌ కమల్‌ బయిద్‌, ట్రస్టీలు శుభోద్‌ కుమార్‌, నండూరి రామకృష్ణ, పీఆర్‌ఓ వంశీ చింతలపాటి, కార్యదర్శి ఎల్‌వీ సుధాకర్‌, కోశాధికారి కె.రామారావు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement