రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొన్న బైక్
కూర్మన్నపాలెం: అగనంపూడి ముఖ్య కూడలి వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలివి. గాజువాక పైడిమాంబకాలనీకి చెందిన వల్లూరి శ్రీనివాసరావు భార్య రమణమ్మ(48) అగనంపూడిలో పాలబూత్ నిర్వహిస్తోంది. అందువల్ల అగనంపూడిలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని, అక్కడ కూడా నివాసం ఉంటు న్నా రు. రమణమ్మ తన వ్యక్తిగత పని నిమిత్తం శుక్రవారం సాయంత్రం కూర్మన్నపాలెం వెళ్లి తిరిగి వస్తున్నారు. సాయంత్రం వేళ అగనంపూడి జంక్షన్‌లో ఆటో దిగి రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో అనకాపల్లి జిల్లా మునగపాక మండలం చూచుకొండకు చెందిన సారిక నాగరాజు(48) తన కుమారుడు జవహర్‌తో కలిసి బైక్‌పై గాజువాక వైపు వస్తున్నారు. ఈ క్రమంలో జంక్షన్ వద్ద ఆమెను బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రమణమ్మ తలకు తీవ్రమైన గాయం కావడంతో అక్కడికక్కడే మరణించారు. బైక్‌పై నుంచి కిందపడిన తండ్రీకొడుకులు నాగరాజు, జవహర్‌లకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా నాగరాజు మార్గమధ్యంలో మృతి చెందారు. జవహర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జవహర్ వికలాంగుడని పోలీసులు తెలిపారు.
ఇద్దరి మృతి, ఒకరికి గాయాలు
రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొన్న బైక్


