అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం : అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం కె.పవన్‌కుమార్ తెలిపారు. విశాఖ–కొల్లాం(08539) వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 18 నుంచి జనవరి 20వ తేదీ వరకు ప్రతీ మంగళవారం ఉదయం 8.20 గంటలకు విశాఖలో బయల్దేరి బుధవారం మధ్యాహ్నం 1.45 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. కొల్లాం–విశాఖపట్నం (08540) వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 19 నుంచి జనవరి 21వ తేదీ వరకు ప్రతీ బుధవారం సాయంత్రం 5 గంటలకు కొల్లాంలో బయల్దేరి గురువారం రాత్రి 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైళ్లు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పడి, జాలర్‌పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదునూర్, పాలక్కడ్, త్రిచ్చూర్, అలువ, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, తిరువల్ల, చెంగన్నూర్, కాయంకులం స్టేషన్లలో ఆగుతాయి.


